మంచి నీటి ట్యాంకర్లులకు బిల్లులు చెల్లించాలని రాస్తారోకో

పొదిలి గ్రామ పంచాయతీ కార్యలయంలో ఎదుట సోమవారం నాడు మంచి నీటి సరఫరా ట్యాంకర్ల యాజమానులు ఆద్వర్యం లో రాస్తారోకో నిర్వహించారు ఈ సందర్భంగా జ్యోతి మల్లిఖార్జనరావు మాట్లాడుతూ గత సంవత్సరం మే నుండి ఇప్పటి వరకు మంచి నీరు సరఫరా చేసే మాకు బిల్లులు సుమారు కోటి 20 లక్షల వరకు చెల్లించవలసిఉండగా ఇప్పటి వరకు ఒక్క రూపాయ ఇవ్వలేదుని అదేవిధంగా గత సంవత్సరం మే నెల నుండి డిసెంబర్ నెల వరకు బిల్లులుకు పరిపాలన ఆమోదం పొందిన గ్రామ పంచాయతీ కార్యదర్శి సకాలంలో స్వదించికుండా నిరంకుశంగా వ్యవరిస్తున్నరని ఆయన అన్నారు సిపియం ప్రాంతీయ కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ తక్షణమే ట్యాంకర్ల యాజమానులుకు బిల్లులు చెల్లించాలని ఆయన ప్రభుత్వంని డిమాండ్ చేసారు. రాస్తారోకో విషయం తెలుసుకోన్న సిఐ యస్ఐలు శ్రీనివాసరావు నాగరాజు సంఘటన స్ధలంకు చేరుకొని ఆందోళనకారులుతో మాట్లడి రాస్తారోకో విరమింపజేసారు ఈ కార్యక్రమంలో జ్యోతి మల్లి వి వెంకటేశ్వర్లు సిపియం నాయకులు రమేష్ నరసింహరావు తదితరులు పాల్గొన్నారు