జిఓ నెంబర్ 2 ను రద్దు చేయాలని కోరుతూ పంచాయతీ కార్యదర్శులు ధర్నా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జిఓ నెంబర్ 2 ను రద్దు చేయాలని కోరుతూ పంచాయతీ కార్యదర్శిలు ధర్నా నిర్వహించారు.
వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయల్లో గ్రామ రెవెన్యూ అధికారులకు డిడిఓ హోదా ఇస్తూ తీసుకొని వచ్చిన జిఓ నెంబర్ 2 ను రద్దు చేయాలని కోరుతూ స్థానిక పొదిలి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం వద్ద శుక్రవారం నాడు గ్రామ పంచాయతీ కార్యదర్శుల సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి అనంతరం మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీకృష్ణ కు వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శుల సంఘం మండల కమిటీ నాయకులు నక్కా బ్రహ్మ నాయుడు, పద్మా, శేషగిరి, తదితరులు పాల్గొన్నారు