అంబెడ్కర్ విగ్రహానికి వినతిపత్రన్ని అందజేసిన పంచాయతీ కార్మికులు
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పొదిలి నగర పంచాయితీ కార్మికులు వినతి పత్రాన్ని అందజేశారు.
పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాచే మనువాదాన్ని కూకటివెళ్ళతో పెకిలించడమే అంబేద్కర్ కి మనం అర్పించే ఘన నివాళని సిఐటియు పశ్చిమ ప్రకాశంజిల్లా ప్రదానకార్యదర్శి యం.లమేష్ అన్నారు.
డాక్టర్ బి.ఆర్.అంబేధ్కర్ 130వ జయంతి సందర్బంగా సిఐటియు ఆధ్వర్యంలో బుదవారం పొదిలి ఎబియం స్కూల్ వద్ద అంబేెధ్కర్ విగ్రహానికి సిఐటియు మండల నాయకులు పి.చార్లెస్ ,జగజ్జీవన్రావు విగ్రహానికి జి.నాగులు పూల దండలు వెశారు.అనంతరం రమేష్ మాట్లాడుతూ అంబేద్కర్ ఏ హక్కులు ,సామాజిక న్యాయం కోసం పోరాడారో అవి నేడు అత్యంత ప్రమాదంలో పడ్డాయన్నారు.కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మనుధర్మాన్ని ప్రోత్సహిస్థూ దళిత, గిరిజన వెనుకబడిన తరగతుల ,మైనార్టీల ప్రజాస్వామిక హక్కులను కాలరాస్థుందన్నారు.దళితులను నేటికి అంటరానివారిగానే చూస్థున్నారన్నారు.
దళితుల ఆర్దిక పురోభివృద్దికి తోడ్పడే సంక్షమ పదకాలకు నిధులలో కోథకోస్థున్నారన్నారు.ప్రకృతి,ఉత్పాదక వనరులను దళిత గిరిజనుల దరిచేరనీయక పోవడంతో ఆర్దిక సమానత్వానికి ఆమడ దూరంలో దళిత,గిరిజనులున్నారన్నారు.దళిత కాలనీలు మౌళిక సౌకర్యాలు లేక సమస్యలతో కోట్టుమిట్టాడుతున్నాయన్నారు.
ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్థున్న మనువాదానికి వ్యతిరేకఃగా అణగారిన తరగతులన్ని ఐక్యంగా పోరాడాలన్నారన్నారు.
ఈకార్యక్రమంలో సిఐటియు పొదిలి మండల నాయకులు పి.చార్లెస్ ,ఆర్.శ్రీనివాసరావు ,కె.శేషయ్య ,కె.వి.నరసింహం ,పి.నాగేంద్రం ,బి.కోటేశ్వరావులు పాల్గొన్నారు