పందులు కనపడతే చర్యలు తప్పవని హెచ్చరించిన పంచాయతీ అధికారులు

ఊరిలో పందులు కనపడితే పెంపకదార్లపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని పంచాయతీ అధికారులు హెచ్చరించారు.

వివరాల్లోకి వెళితే ఊరిలో పందుల సంచారం ఎక్కువైపోయిందని పందుల సంచారం వలన ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఫిర్యాదులు అందాయని పంచాయతీ అధికారులు తెలిపారు.

ఈ విషయంపై పంచాయతీ అధికారులు స్పందిస్తూ పందుల పెంపకదార్లకు ఇటీవల పందులను ఊరికి 5కిలోమీటర్ల దూరంలో పెంపకం జరపాలని ఊరిలో పెంపకం చేపడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేయడం జరిగిందని….. అయినా కూడా పందుల సంచారంపై వస్తున్న ఫిర్యాదులు అలాగే ప్రజల ఆరోగ్యం దృష్ట్యా 20వ తేదీన పందుల పెంపకదార్లకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందని…. అలాగే పందులు ఊరిలో ఎక్కడ కనపడినా వాటిని పట్టి అడవులలో వదిలివేయడం జరుగుతుందని అలాగే పెంపకదార్లపై కూడా చర్యలు తీసుకుంటామని గ్రామ పంచాయతీ శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతిరావు తెలిపారు