పండుగ వాతావరణంలో పెన్షన్లను పంపిణీ చేసిన ఉడుముల…
వైఎస్ఆర్ భరోసా పెన్షన్లను మాజీ శాసనసభ్యులు ఉడుముల శ్రీనువాసులరెడ్డి పంపిణీ చేశారు. వివరాల్లోకి వెళితే సోమవారంనాడు స్థానిక పంచాయతీ కార్యాలయంలో నందు పండుగ వాతావరణం తలపించేలా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఉడుముల శ్రీనువాసులరెడ్డి మాట్లాడుతూ గతంలో వైయస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పెన్షన్లను అందించారని….. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి కూడా అదే బాటలో పనిచేస్తున్నారని ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఏదైతే హామీలను నవరత్నాలను రూపంలో ఇచ్చామో అమలు చేయడంలో కూడా రాజకీయాలు వివక్షను చూడకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రామ్మోహన్ రావు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు,పెన్షన్ దారులు, గ్రామ పంచాయతీ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.