పండు అనిల్ ఆధ్వర్యంలో చంద్రన్నబాట – కందులబాట
పొదిలి మండలం కుంచేపల్లి గ్రామం నందు చంద్రన్న మాట – కందుల బాట 14వ రోజు ప్రజా ఆశీర్వాద పాదయాత్ర కుంచేపల్లి గ్రామంలో పండు అనిల్, బాదం రవిల ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాలుగా చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం లోటు బడ్జెట్ లో ఉన్నా కూడా తెలుగుదేశం ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తీరును ప్రజలకు వివరిస్తూ నియోజకవర్గంలో త్రాగునీటికి ఎటువంటి సమస్య తలెత్తకుండా తగు చర్యలు తీసుకున్నామని అలాగే పార్టీలకు అతీతంగా పెన్షన్లను అందజేస్తున్నామని రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణమాఫీ, గత పాలకులు వెలుగొండ ప్రాజెక్ట్ విషయంలో చేసిన మోసాన్ని ప్రజలకు వివరిస్తూ అభివృద్ధి చేసేవారిని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పొదిలి మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ చప్పిడి రామలింగయ్య, పొదిలి మాజీమండల పార్టీ అధ్యక్షులు యర్రం రెడ్డి వెంకటేశ్వరరెడ్డి, పొదిలి నిర్మమహేశ్వర స్వామి దేవస్థాన కమిటీ ఛైర్మెన్ సామంతపూడి నాగేశ్వరరావు, తెదేపా మండల నాయకులు రసూల్, జిలాని, ఖుద్దుస్, సిబియన్ ఆర్మీ ఇంచార్జ్ బండారు బాబు, సిబియన్ ఆర్మీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.