విలేకరులకు డైరీలు పంపిణీ చేసిన జంకె
పొదిలి,కొనకనమిట్ల మండలాలకు చెందిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు 2019వ సంవత్సరం డైరి మరియు క్యాలెండర్ లను శాసనసభ్యులు జంకె వెంకటరెడ్డి పంపిణీ చేశారు. స్ధానిక షామ్స్ ఉల్-ఉలూమ్ బీఈడీ కాలేజి ఆవరణలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిధిగా హాజరైన జంకె వెంకటరెడ్డి మాట్లాడుతూ ఏ1 గ్లోబల్ విద్యా సంస్థల పేరుతో మార్కాపురంలో ఇంజినీరింగ్ కళాశాల మరియు పొదిలిలో బిఈడి కళాశాలలు ఏర్పాటు చేసి వృత్తి విద్యా విభాగాలతో ఎంతో మంది విద్యార్థులను ప్రతిభావంతులుగా తయారు చేయడమే కాకుండా తమ ద్వారా ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ స్ఫూర్తిదాయకంగా నిలిచారని కొనియాడారు . ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ షంషేర్ అలీ బేగ్, కార్యదర్శి జాఫర్ అలీ బేగ్, జర్నలిస్టు యూనియన్ నాయకులు రమణ, తదితరులు పాల్గొన్నారు.