పాఠశాలలు విలీనం నిరసిస్తూ తల్లిదండ్రులు పిల్లలు ఆందోళన
బడులు విలీనం పట్ల తల్లిదండ్రులు విద్యార్థులు ఆందోళన నిర్వహించారు.
పొదిలి మండలం మాదాల వారి పాలెం గ్రామంలోని పాఠశాలలు విలీనాన్ని నిరసిస్తూ గ్రామంలోని పాఠశాలకు తల్లిదండ్రులు తాళాలు వేసి తమ నిరసనను వ్యక్తం చేశారు.
అదే విధంగా పొదిలిమ్మ నగర్ పాఠశాల ఎదుట తల్లిదండ్రులు విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి యం రమేష్ మాట్లాడుతూ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు విలీనాన్ని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన నిరసన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.