విభిన్న ప్రతిభావంత విద్యార్థులు పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి – న్యాయమూర్తి భార్గవి
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
విభిన్న ప్రతిభావంత విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని పొదిలి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి భార్గవి అన్నారు.
అంతర్జాతీయ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సోమవారం నాడు స్థానిక భవిత పాఠశాల నందు జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సు లో న్యాయమూర్తి భార్గవి మాట్లాడుతూ మానసిక బాలబాలికలు చాలా సున్నితంగా ఉంటారని వారి పట్ల తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు జాగ్రత్తగా చూసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి ఎం శ్రీనివాసులు, బార్ అసోసియేషన్ నాయకులు యస్ ఎం భాషా, బొడగిరి వెంకటేశ్వర్లు, న్యాయవాదులు హర్ష చక్రవర్తి, సురేష్ కుమార్, అనిల్ కుమార్, పాఠశాల ఉపాధ్యాయులు గోపాల కృష్ణ ప్రవీణ్ కుమార్ మరియు కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు