వినాయక మండపం పై పార్టీ జెండాలు పాటలు నిషేధం – సిఐ రాఘవేంద్ర
వినాయక మండపాల అనుమతులకు ఐదుగురు సభ్యులతో కమిటీ గా ఏర్పడి దరఖాస్తు చేసుకోవాలని పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ వీరా రాఘవేంద్ర అన్నారు.
శుక్రవారం నాడు స్థానిక పొదిలి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వినాయక మండపాల కు రాజకీయ పార్టీల జెండాలు ఏర్పాటు పాటలు పెట్టడం నిషేధం అని నిమజ్జనం సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారు.
పోలీసు వారి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ రాఘవేంద్ర అన్నారు.
ఈ విలేకరుల సమావేశంలో పొదిలి యస్ఐ వెంకట సైదులు, కొనకనమిట్ల యస్ఐ బ్రహ్మ నాయుడు, తాడివారిపల్లి యస్ఐ తదితరులు పాల్గొన్నారు