పట్టాదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొండి – జిల్లా కలెక్టర్
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
ఇంటి నిర్మాణం పనులు చేసుకోలేని పట్టాదారులు జెయన్ఆర్ కంపెనీతో ఒప్పందం చేసుకొనే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు.
వివరాల్లోకి వెళితే శుక్రవారం నాడు స్థానిక పొదిలి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం నందు మేజర్ లేఔట్ లోని లబ్దిదారులతో గృహ నిర్మాణ శాఖ అధికారులు సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎక్కువ మంది ప్రజలు తాము ఇంటి నిర్మాణం పనులు చేసుకోలేమని ప్రభుత్వమే ఇంటి నిర్మాణం చేయించి ఇస్తే బాగుంటుందని దృష్టి తీసుకొని రావడంతో తను జిల్లా కలెక్టర్ తో మాట్లాడి జె యన్ ఆర్ నిర్మాణ సంస్థవారిని నిర్మాణం పనులు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరటం జరిగిందని ప్రతి ఒక్క లబ్దిదారుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కనిగిరి రెవెన్యూ డివిజన్ అధికారి సంపత్ కుమార్ గృహ నిర్మాణ శాఖ డిప్యూటీ ఇంజనీర్ పవన్ కుమార్, మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసప్ తహశీల్దారు భాగ్యలక్ష్మి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీకృష్ణ మరియు లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు