పొదిలిటైమ్స్ అవార్డ్స్-2019 … ఉత్తమ ప్రాధమిక చికిత్స కేంద్రం అవార్డు గ్రహీత వెంకటరెడ్డి
పొదిలి టైమ్స్ అవార్డ్స్-2019 ఉత్తమ ప్రాధమిక చికిత్స కేంద్రం అవార్డు గ్రహీతగా యర్రం వెంకటరెడ్డిని ఎంపిక చేసి టైమ్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం అవార్డును ప్రధానం చేశారు.
పొదిలి టైమ్స్ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా స్ధానిక చిన్న బస్టాండ్ నందు యర్రం వెంకటరెడ్డి ఆధ్వర్యంలో 20సంవత్సరాల నుండి ప్రాధమిక చికిత్స కేంద్రం నడుపుతూ అత్యవసర పరిస్థితిలో అలాగే సాధారణ పరిస్థితిలో ప్రాధమిక చికిత్స అందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల మన్ననలు చొరగొన్నారు.
ఆయన సేవలను గుర్తిస్తూ ఉత్తమ ప్రాధమిక చికిత్స కేంద్రం అవార్డును ప్రధానం చేసి టైమ్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం ఘనంగా సత్కరించారు.