ఇంటి పన్నులు చెల్లించండి గ్రామ అభివృద్ధికి పాటుపడండి – డిపిఓ నారాయణ రెడ్డి
పొదిలి మండల పరిధిలోని ఉప్పులపాడు , తలమల్ల గ్రామ సచివాలయంల్లో జిల్లా పంచాయతీ అధికారి జి వి నారాయణ రెడ్డి ఆకస్మికంగా పర్యటించి తనిఖీలు నిర్వహించారు.
అనంతరం పొదిలి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం నందు ఎంపిడిఓ శ్రీకృష్ణ అధ్యక్షతనతో జరిగిన పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశంలో పాల్గొని వేసవి కాలంలో మంచి నీటి సరఫరా మరియు 100 శాతం ఇంటి పన్నులు వసూలు ప్రజలకు మెరుగైన సదుపాయాలు ఇతర అంశాలపై డిపిఓ నారాయణ రెడ్డి సమీక్షించారు.
ఈ కార్యక్రమంలో ఈఓఆర్డీ రాజశేఖర్, మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు