రైతులకు అందుబాటులో ఉంటా: పిడిసిసి బ్యాంకు ఛైర్మన్

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

రైతుల సమస్యల పరిష్కారం కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ ఛైర్మన్ ప్రసాద్ రెడ్డి (బన్నీ) అన్నారు

గురువారం నాడు స్థానిక పొదిలి కేంద్ర సహకార బ్యాంకు బ్రాంచ్ కార్యాలయాన్ని సందర్శించిన బ్యాంకు చైర్మన్ ప్రసాద్ రెడ్డి (బన్నీ) కి బ్యాంకు సిబ్బంది, సొసైటీ పాలకవర్గ సభ్యులు స్వాగతం పలికారు

అనంతరం రైతులకు 23 లక్షల రూపాయలు చెక్కలను పంపిణీ చేశారు

ఈ కార్యక్రమంలో మాదాలవారిపాలెం, చిన్నరికట్ల నాగరాజుకుంట సొసైటీల పాలకవర్గ సభ్యులు, మరియు బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు