రేపటి నుండి ఉచితంగా నిత్యావసర వస్తువుల పంపిణీ – తహశీల్దారు ప్రభాకరరావు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రేపు అనగా ఆదివారం నుండి చౌకధరల దుకాణాల నందు ఉచితంగా నిత్యావసర వస్తువుల పంపిణీ చేయడం జరుగుతుందని మండల రెవెన్యూ తహశీల్దారు ప్రభాకరరావు తెలిపారు.
వివరాల్లోకి వెళితే స్థానిక మండల రెవెన్యూ తహశీల్దారు కార్యాలయంలో ఆయనను కలిసిన పొదిలి టైమ్స్ ప్రతినిధితో మాట్లాడుతూ రేపు ఆదివారం నుండి ఏప్రిల్ 14వతేది వరకు ఉదయం 6గంటల నుండి మధ్యాహ్నం 1గంటల వరకు చౌకధరల దుకాణాల వద్ద సామాజిక దూరం కనీసం ఒక మీటరు పాటించి నిత్యావసర వస్తువుల తీసుకోవాలని బియ్యం , కందిపప్పు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని తహశీల్దారు ప్రభాకరరావు తెలిపారు.