సియం ను సైకో అంటే చెప్పు తీసుకొని కొడతాం – పెద్దిరెడ్డి సూర్య ప్రకాష్ రెడ్డి

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

టిడిపి నేత కందుల వలనే ప్రత్యేక జిల్లా ఏర్పాటు కాలేదు

మార్కాపురం ప్రత్యేక జిల్లా ఉద్యమంలో కందుల చీకటి ఒప్పందాలు బట్టబయలు చేస్తా – పెద్దిరెడ్డి సూర్య ప్రకాష్ రెడ్డి

మార్కాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దిరెడ్డి సూర్య ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు గురువారం నాడు స్థానిక మంజునాథ కళ్యాణ మంటపం నందు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు పెద్దిరెడ్డి సూర్య ప్రకాష్ రెడ్డి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైకో అంటే చెప్పు తీసుకొని కొడతా నంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అదే విధంగా ప్రత్యేక మార్కాపురం జిల్లా ఏర్పాటు లో కందుల నారాయణరెడ్డి అనుసరించినా తీరు చీకటి ఒప్పందాలను త్వరలో బట్టబయలు చేస్తానని కందుల నారాయణరెడ్డి పై విరుచుకుపడ్డారు.

పొదిలి మున్సిపల్ కార్యాలయం నందు టౌన్ ప్లానింగ్ అధికారి వెంకటేశ్వర్లు అక్రమ వసూళ్లు కు పాల్పడుతు ప్రజలున్న తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని తక్షణమే టౌన్ ప్లానింగ్ అధికారి వెంకటేశ్వర్లు ను సస్పెండ్ చేయాలని లేకపోతే మున్సిపల్ కార్యాలయం వద్ద ఆమరణ దీక్ష చేస్తానని అన్నారు. అనంతరం ప్రెస్ క్లబ్ కు లక్ష రూపాయలు విరాళాన్ని ప్రకటించారు