100వ రోజుకు చేరిన పెన్ పవర్ అన్నదానం
పెన్ పవర్ అన్నదాన కార్యక్రమం నేటికి 100వ రోజుకు చేరుకుంది.
వివరాల్లోకి వెళితే కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ నుండి నేటి వరకు పెన్ పవర్ దినపత్రిక ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయం వద్ద పంచాయతీ కార్మికులకు నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం నేటికి 100వ రోజుకు చేరుకుంది.
ఈ సందర్భంగా నిర్వాహకులు ఓబులశెట్టి రాధాకృష్ణ మాట్లాడుతూ కోవిడ్ వ్యాప్తిలో కూడా తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కష్టపడుతున్న పంచాయతీ కార్మికులకు భోజనాలు ఏర్పాటు చేయడం ఎంతో సంతృప్తినిచ్చిందని….. ఇంతటి బృహత్తర కార్యక్రమం నిర్వహించేందుకు చేయుతనిస్తున్న దాతల సహకారం మరువలేనిదని….. కోవిడ్ వ్యాప్తి పూర్తిగా నశించేంత వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు.
అనంతరం నిర్వాహకులు ఓబులశెట్టి హరప్రసాద్ మరియు ఓబులశెట్టి రాధాకృష్ణను ఆంధ్రప్రదేశ్ విలేకరుల యూనియన్ నాయకులు సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
అన్నదానం 100రోజు సందర్భంగా పొదిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుఱ్ఱపుశాల కోటేశ్వరి దాతగా వ్యవహరించారు…. ఈ కార్యక్రమానికి వైసీపీ నాయకులు సానికొమ్ము శ్రీనివాసరెడ్డి, కళ్ళం సుబ్బారెడ్డి, జి శ్రీనివాసులు, గొలమారి చెన్నారెడ్డి మహిళా నాయకురాలు షేక్ నూర్జహాన్ తదితరులు ముఖ్యఅతిథులుగా హాజరై బోజనాలను వడ్డించారు.