పెన్‌పవర్‌ ఆధ్వర్యంలో పేదల అన్నదానాన్ని ప్రారంభించిన మర్రిపూడి ఎంపిపి అభ్యర్థి వాకా

పెన్‌పవర్‌ ఆధ్వర్యంలో నిరుపేదు, పంచాయతీ కార్మికుకు లాక్‌ డౌన్‌ పూర్తయ్యే వరకు ప్రారంభించిన అన్నదాన కార్యక్రమాన్ని మర్రిపూడి ఎంపిపి అభ్యర్థి వాకా వెంకటరెడ్డి ప్రారంభించారు. వివరాలు లోకి వెళ్ళితే స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం బుధవారం నాడు ప్రారంభం సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన వాకా వెంకటరెడ్డి మాట్లాడారు. పెన్‌పవర్‌ దినపత్రిక రెసిడెంట్‌ ఎడిటర్‌ రాధాకృష్ణ పంచాయతీలో పని చేసే కార్మికు, ఆకలితో అమటించే పువురు పేదకు అన్నదానం ఏర్పాటు చేద్దామని మంచి ఉద్ధేశ్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారన్నారు. ఈ కార్యక్రమంలో తన వంతు గా రూ.10 మే ఆర్ధిక సహాయం అందించానన్నారు. ప్రజను, పట్టణాన్ని రక్షించే కార్మికుకు భోజనం అందజేయం ఆనందంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో సేవా కార్యక్రమాు చేపట్టినా వాటికి తన వంతు సహాయ సహకారాు ఎళ్ళవేళలా అందిస్తానని తెలిపారు. మాజీ జడ్పీటిసి సాయి రాజేశ్వరరావు మాట్లాడుతూ మా ప్రాణాను రక్షించేందుకు మీ ప్రాణాను ఫణంగా పెట్టి పని చేస్తున్న మీకు భోజనం ఏర్పాటు చేయడం, అందులో మమ్మును భాగస్వాముగా చేయడం సంతోషంగా ఉందన్నారు. పెన్‌పవర్‌ తపెట్టిన ఈ కార్యక్రమం విజయవంతం కావాని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పొదిలి మండ స్పెషల్‌ ఆఫీసర్‌ డి శ్రీనివాసురెడ్డి, పంచాయతీ ఇఓ బ్రహ్మనాయుడు, మాజీ శివాయ కమిటీ ఛైర్మన్‌ యక్కలి శేషగిరిరావు, ఆక్స్‌ఫర్డ్‌ స్కూల్‌ డైరక్టర్‌ ఎ అంజిరెడ్డి, ఆర్‌ఎంపి వైద్యు వై వెంకటరెడ్డి, పొదిలి కన్జుమర్‌ వెల్ఫేర్‌ ఆర్గనైజేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ చిట్టంశెట్టి వెంకట సుబ్బారావు, కార్యదర్శి, జిల్లా వినియోగదారు సంఘా సమాఖ్య కార్యవర్గ సభ్యులైన ఓబుశెట్టి కుసుమ హరప్రసాద్‌, శ్రీ మంజునాథ ఎసి ఫంక్షన్‌హాు యజమాని కారంశెట్టి మధు, శానిటరీ ఇన్స్‌పెక్టర్‌ మారుతీరావు, పంచాయతీ సిబ్బంది, వాంటీర్లు, సచివాయ సిబ్బంది పాల్గొన్నారు.