పొదిలి లో ఆధార్ సెంటర్లుకు క్యూ కడుతున్న ప్రజలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పధకాలు పొందాలంటే ఆధార్ కు మొబైల్ తో లింక్ కావాలని సూచించడంతో ప్రజలు ఆధార్ సెంటర్ల దగ్గర పడిగాపులు కాస్తున్నారు
పట్టణంలో రెండు కేంద్రాలుండగా ఒకటి బిఎస్ఎన్ఎల్ ఆఫీసు, మరొకటి శ్రావణి ఎస్టేట్ లో ఉండగా దానిని ఇటివల అధికారులు తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు.
కరోన తీవ్రరూపం దాల్చుతుండగా ఏమాత్రం లెక్కచేయకుండా ప్రజలు గుంపులుగుంపులుగా పొగవుతున్నారు
ఈ నెలాఖరు వరకే సమయం అనే ప్రచారం సాగుతుండటం తో ఆధార్ కేంద్రాల వద్ద తెల్లవారుఝామున నుంచే స్థానిక బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున మహిళలు తరలివస్తున్నారు
అధికారులు స్పందించి ఆధార్ కార్డు లింక్ ఆఖరుతేదిపై స్పష్టత ఇవ్వాలని ప్రజలుకొరుతున్నారు