పి4 సర్వేకు ప్రజలు సహకరించాలి – మున్సిపల్ కమిషనర్
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
పి4 సర్వేకు ప్రజలు సహకరించాలని పొదిలి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు శనివారం నాడు తెలిపారు.
నగర పంచాయతీ లో పబ్లిక్, ప్రయివేటు, పీపుల్స్ పాట్నర్ షిప్ మోడల్ లో భాగంగా అత్యంత నిరుపేదలను గుర్తించటానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన పి4 సర్వే మార్చి 2వ తేదీ వరకు సచివాలయం సిబ్బంది చేత నిర్వహించబడుతుందని ఆయా తెలిపారు.
ఈ సర్వే లో అత్యంత వెనుకబడిన 20శాతం మందిని గుర్తించి వారికి మెరుగైన సహాయం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఈ సర్వే సకాలంలో పూర్తి చేసేందుకు సచివాలయం సిబ్బందికి ప్రజలు సహకరించాలని ఆయన కోరారు