కోవిడ్ వ్యాక్సిన్ కై బారులు తీరిన ప్రజలు
వివరాల్లోకి వెళితే బుధవారంవారం నాడు స్థానిక పొదిలి ప్రభుత్వ వైద్యశాల నందు కోవిడ్ వ్యాక్సిన్ కై ప్రజలు బారులుతీరారు.
కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ మూడో దశ మార్చి 1వ తేదీ నుంచి మొదలైందన విషయం తెలిసిందే అందులో భాగంగా మూడో దశ లో 60 సంవత్సరాల వయస్సు పైబడిన వారు దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న 45 సంవత్సరాల వేసి పైబడిన వారు తప్పని సరిగా వ్యాక్సినేషన్ చేయించుకోవాలని అధికారులు ఇచ్చిన పిలుపుమేరకు ప్రతి రోజు పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి వ్యాక్సిన్ వేయించుకోంటున్నారు.
అదే విధంగా రెండో దశలో వ్యాక్సిన్ వేసుకున్నా వారు 28 రోజుల అనంతరం మరో డోస్ తీసుకుంటున్నారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వం వైద్య నిపుణులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు