పేరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొక్కలు, గుడ్డసంచులు పంపిణీ
పేరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలురకాల మొక్కలు మరియు గుడ్డసంచులను మార్కాపురం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి పంపిణీ చేశారు.
వివరాల్లోకి వెళితే పర్యవరణ పరిరక్షణలో భాగంగా “స్వచ్ఛతేసేవ” కార్యక్రమంలో పాల్గొన్న మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డితో కలిసిన పేరం ఫౌండేషన్ నిర్వాహకులు రహదారులు మరియు భవనముల శాఖ అతిథిగృహం వద్ద నుండి మొదలైన పర్యావరణ పరిరక్షణ మరియు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగార్జునరెడ్డి మాట్లాడుతూ పేరం ఫౌండేషన్ నిర్వాహకులు పలురకాల సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం హర్షించదగ్గ విషయమని…. పేరం ఫౌండేషన్ ద్వారా ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు.
ప్లాస్టిక్ వాడకంద్వారా పర్యావరణానికి తద్వారా జీవరాసులకు వాటిల్లే ప్రమాదం గురించి ప్రసంగించారు. అలాగే ప్రతిఒక్కరు విధిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. అనంతరం పేరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గుడ్డసంచులు, మొక్కలను పంపిణీ చేశారు.