ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం మార్కాపురం నియోజకవర్గం కన్వీనర్ గా పెరిసోముల శ్రీనివాసులను నియమిస్తూ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ చింతాడ బ్రహ్మానందరావు నియామకం ఉత్తర్వులు జారీచేశారు.
ఈ సందర్భంగా నియోజకవర్గ కన్వీనర్ పెరిసోముల శ్రీనివాసులు మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని విశ్వకర్మలను ఏకతాటిపైకి తెచ్చి తమ హక్కుల కోసం పోరాడుతామని తెలిపారు