జంకె , మున్సిపల్ కమిషనర్ లకు వినతి పత్రాలను అందజేసిని వికలాంగుల సంఘం

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జిల్లా అధ్యక్షులు జంకె వెంకటరెడ్డి కి నవ్యాంధ్ర వికలాంగుల హక్కుల సేవా సమితి నాయకులు వినతిపత్రాన్ని అందజేశారు.

 

పొదిలి పట్టణంలోని రాజుపాలెం గ్రామ సమీపంలో 2018 సంవత్సరంలో 47 మంది దివ్యాంగులకు ఇంటి నివేశన స్థలాలు ఇచ్చిన నేటికీ లేఔట్ అభివృద్ధి చేయలేదని ప్రస్తుతం పెద్ద ఎత్తున చిల్ల చెట్లు పెరిగిపోవడంతో ఇంటి నిర్మాణం చేసుకున్నా వారి ఇండ్లలో పాములు తిరుగుతున్నాయని అధికారులు పట్టించుకోవడం లేదని జిల్లా అధ్యక్షులు జంకె వెంకటరెడ్డి దృష్టికి తీసుకొని వెళ్లగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వెళ్ళి సమస్యను పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్ల నవ్యాంధ్ర వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు.

పొదిలి నగర పంచాయితీ పరిధిలోని మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ల్లో దివ్యాంగులకు 4శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసప్ కు నవ్యాంధ్ర వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు.

 

ఈ కార్యక్రమంలో నవ్యాంధ్ర వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు షేక్ కాలేషా , స్థానిక నాయకులు బి వి నరసింహారావు, ముల్లా మాదర్ వలి, సయ్యద్ రజక్ తదితరులు పాల్గొన్నారు