ఫోటోగ్రాఫర్ల నూతన కార్యవర్గం కమిటీ ఎన్నిక

పొదిలి, మర్రిపూడి, కొనకనమిట్ల మండలాల ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ల అసోసియేషన్  2020సంవత్సరానికి నూతన కార్యవర్గ కమిటీని ఎన్నిక నిర్వహించారు.

వివరాల్లోకి వెళితే పట్టణంలోని విశ్వశాంతి స్కూల్ నందు జరిగిన సమావేశంలో ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులకు సంబంధించి ప్రెసిడెంట్ గా తోట సుబ్బారావును ‘మా’ స్టూడియో, వైస్ ప్రెసిడెంట్ గా గిద్దలూరి ప్రశాంత్ అమ్మ స్టూడియో,
గౌరవ అధ్యక్షుడిగా గోపిశెట్టి శ్రీనువాసులు న్యూ గీత స్టూడియో, సెక్రటరీ యడవల్లి శ్రీనివాసులు శ్రీనివాస స్టూడియో, జాయింట్ సెక్రటరీగా
బసవయ్య అమ్మ స్టూడియో మర్రిపూడి, ట్రెజరర్ గా శ్రీను విజయ స్టూడియో, గౌరవ సలహాదారులుగా యద్దనపూడి బ్రహ్మం బ్రహ్మ డిజిటల్స్, మరియు పార్లపల్లి మల్లికార్జునరావు విష్ణు స్టూడియో, లను ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.

షేక్ కాలేషా, సామంతపూడి పరమేశ్వరరావు సామంతపూడి స్టూడియో, గోనె భువనేశ్వర రావు (భాను) గణేష్ స్టూడియో, మద్దుల విజయ్ విజయ స్టూడియోఎన్నికల కమిటీ సభ్యులుగా వ్యవహరించారు.