ఫోటో గ్రాఫర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శిలుగా లింగాల, నారబోయిన

పొదిలి, కొనకనమిట్ల, మర్రిపూడి మండలాల ఫోటో గ్రాఫర్స్ యూనియన్ అధ్యక్షర్యదర్శిలుగా లింగాల సురేష్, నారబోయిన సురేష్ యాదవ్‌ లు ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి తెలిపారు.

వివరాల్లోకి వెళితే స్థానిక ఒక ప్రైవేటు సముదాయంలో మంగళవారం సాయంత్రం జరిగిన సమావేశంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

గౌరవ అధ్యక్షులుగా బాబు, గౌరవ సలహాదారులుగా మహంతా అశోక్, రావుగారి శ్రీకాంత్, మందాటి ప్రవీణ్ కోటి, అశోక్

అధ్యక్ష కార్యదర్శులుగా లింగాల సురేష్, నారబోయిన సురేష్ యాదవ్‌, ఉపాధ్యక్షులుగా షేక్ షాకీర్, సహాయ కార్యదర్శిగా పొతకమురి శ్రీను, కోశాధికారిగా యలవర వెంకటేశ్వర్లు లతో కూడిన నూతన కమిటీని ఎన్నుకున్నారు.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన వైకాపా నేత జి శ్రీనివాసులు మాట్లాడుతూ యూనియన్ కు పూర్తిగా అండగా ఉంటానని మీకు ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తానని హామీ ఇచ్చారు.