దుప్పట్లు పంపిణీ చేసిన ఫోటో గ్రాఫర్ యూనియన్
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా పొదిలి మరిపూడి, కొనకనమిట్ల మండలాల ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ ఓల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దుప్పట్లను పంపిణీ చేశారు.
సోమవారం నాడు స్థానిక పొదిలిలోని శ్రీపతి నగర్ కాలనీలో 40 కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా శ్రీపతి నగర్ వాసులు ఇలాంటి సేవా కార్యక్రమాలను చేసి మాలాంటి నిరుపేదలను ఆదుకోవాలని దుప్పట్లను పంపిణీ చేసిన యూనియన్ వారిని అభినందించారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు రావూరి శ్రీకాంత్, యూనియన్ నాయకులు అశోక్, జి శ్రీనివాసులు, సిహెచ్. శ్రీనివాసులు, కృష్ణ, వి. శ్రీనివాసులు, శ్రీధర్, ప్రవీణు, దేవా, వెంకటేశ్వర్లు, వెంకట్రావు,రాజు,సురేంద్ర, అభి, శీనన్న, తదితరులు పాల్గొన్నారు.
అనంతరo యూనియన్ సీనియర్ ఫోటోగ్రాఫర్ సిహెచ్. శ్రీనివాసులు ను ద ఘనంగా సన్మానించారు