పిడుగుపాటుకు 15గొర్రెలు మృతి….. మృతి చెందిన గొర్రెలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్

పిడుగుపాటుకు 15 గొర్రెలు మృతిచెందిన సంఘటన సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే సోమవారం తెల్లవారుజామున పొదిలి మండలం బట్టువారిపల్లి గ్రామంలో పిడుగుపాటుకు గోడ కూలడంతో కాకునూరి నర్సిరెడ్డికి చెందిన 15గొర్రెలు మృతి చెందాయి. వీటి విలువ సుమారు రెండు లక్షలు రూపాయలు ఉంటాయని బాధితుడు తెలిపారు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన గొర్రెలు, మేకల పెంపకదార్ల సంఘం జిల్లా కార్యదర్శి తోట తిరుపతిరావు, సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్ బాధితుడిని పరామర్శించారు.

అనంతరం ఈ విషయంలో ప్రభుత్వం స్పందించి చనిపోయిన గొర్రెలకు ఒక్కోదానికి 10వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని అలాగే షెడ్డు నిర్మాణంకోసం ఆర్ధిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గొర్ల కాపరులు సంఘం జిల్లా నాయకులు ఈర్ల బాలవెంకటేశ్వర్లు, అంజనేయరెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.