ప్లాస్టిక్ కవర్ల వాడకంపై పలు దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు

నిషేధిత ప్లాస్టిక్ కవర్ల వినియోగం నేపథ్యంలో పట్టణంలోని దుకాణాలలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించిన అధికారులు పలు దుకాణాలలో వినియోగిస్తున్న ప్లాస్టిక్ కవర్లను గుర్తించి దుకాణ యజమానులకు జరిమానా విధించారు.

ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీకృష్ణ, గ్రామ పంచాయతీ ప్రత్యేకాధికారి శ్రీనివాసరెడ్డి, పంచాయతీ కార్యదర్శి బ్రహ్మనాయుడు, సానిటరీ ఇన్స్పెక్టర్ మారుతిరావు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.