నిషేధిత ప్లాస్టిక్ రహిత పొదిలి దిశగా పంచాయతీ అధికారుల చర్యలు
నిషేధిత ప్లాస్టిక్ కవర్ల వినియోగం నేపథ్యంలో పట్టణంలోని పలు దుకాణాలలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించిన గ్రామ పంచాయతీ అధికారులు పలు దుకాణాలలో వినియోగిస్తున్న ప్లాస్టిక్ కవర్లను గుర్తించి దుకాణ యజమానులకు జరిమానా విధించారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బ్రహ్మనాయుడు, శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతిరావు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.