ప్లాస్టిక్ వ్యర్ధరహిత భారత్ ను నిర్మిద్దాం : కుందూరు
ప్లాస్టిక్ వ్యర్ధరహిత భారత్ ను నిర్మిద్దామని మార్కాపురం శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి పిలుపునిచ్చారు.
వివరాల్లోకి వెళితే శనివారంనాడు స్ధానిక రోడ్లు మరియు భవనముల అతిథిగృహం నుండి పెద్ద బస్టాండ్ మీదుగా చిన్న బస్టాండ్ వరకు “స్వచ్ఛతేసేవ” కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ ప్లాస్టిక్ వలన పర్యావరణం పాడవడమే కాకుండా ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని…. ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టాలని… పర్యావరణాన్ని రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం పట్టణ పురవీధులలో ప్లాస్టిక్ వాడకం దానివలన జరిగే అనర్ధాలపై నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నక్కా బ్రహ్మనాయుడు, శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతిరావు, వైసీపీ నాయకులు సాయిరాజేశ్వరరావు, వాకా వెంకటరెడ్డి, కల్లం సుబ్బారెడ్డి, జి శ్రీనివాసులు, గొలమారి చెన్నారెడ్డి, షేక్ మహబుబ్ బాషా, హనిమున్ శ్రీనివాసరెడ్డి, రోటీ రబ్బాని, షేక్ గౌస్, మరియు పంచాయతీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.