మోదీకి గట్టి పోటీ ఇస్తున్న షాలిని యాదవ్
భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండవ సారి పోటీ చేస్తున్న వారణాసి పార్లమెంట్ నియోజకవర్గం నుండి తనకు ప్రత్యర్థిగా స్ధానిక మహిళా నేత మహా సంఘటన బలపరచిన సమాజ్ వాది పార్టీ అభ్యర్థిగా షాలిని యాదవ్ ను బరిలో నిలపడంతో మోదీ గట్టి పోటీనే ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది.
2014 ఎన్నికలలో నరేంద్ర మోదీ సమీప ప్రత్యర్థి అయిన అరవింద్ క్రేజీవాల్ పై 3లక్షల 71 వేల మెజారిటీతో గెలుపొందారు. వారణాసి పార్లమెంట్ నియోజకవర్గంలో 17లక్షల 75 వేల 890 వందల ఓట్లు ఉండగా ఇందులో బ్రాహ్మణ 2లక్షల 50 వేలు….. వైశ్యులు 2 లక్షలు….. పటేల్ 2లక్షలుగా ఉన్నారు. వీరంతా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నరేంద్ర మోదీకి అండగా ఉండగా ముస్లింలు 3లక్షలు…. యాదవులు 2లక్షలు…. దళితులు 2 లక్షలుగా ఉన్నారు. కాగా వీరంతా మహా కూటమి బలపరచిన సమాజ్ వాది పార్టీ అభ్యర్థి షాలిని యాదవ్ కు అండగా ఉన్నారు.
షాలిని యాదవ్ మామయ్య రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్ గా…. స్ధానికంగా మూడు సార్లు శాసనసభ సభ్యులుగా పని చేసిన రాజకీయ కుటుంబ నేపథ్యం నుండి వచ్చిన మహిళగా 2017వారణాసి మేయర్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరుపున పోటి చేసి స్వల్ప తేడాతో ఓటమి చవిచూసిన ఆమె సాంప్రదికంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కుటుంబం. షాలిని యాదవ్ ఉత్తరప్రదేశ్ లో ప్రస్తుతం మారిన రాజకీయ పరిస్థితిలో సమాజ్ వాది పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, రాష్ట్రీయ లోక్ దళ్, ఈ మూడు రాజకీయ పార్టీలు కలిసి మహాకూటమిగా ఏర్పడి ఎన్నికలలో ప్రస్తుతం పోటీ చేస్తుండడంతో బిజేపి గట్టి పోటీనే ఎదుర్కొనే పరిస్థితి ఉంది.
అందులో భాగంగా వారణాసిలో మోదీపై స్థానికంగా పట్టున్న షాలిని యాదవ్ ను సమాజ్ వాది పార్టీ తరుపున మహాకూటమి ఈ ఎన్నికల బరిలో దించింది.
దానితో వారణాసి పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రధాని నరేంద్ర మోదీకి నువ్వా? నేనా? అనే స్ధాయిలో షాలిని యాదవ్ పోటీ ఇస్తుంది.
కాగా ఇప్పటి వరకు ఇక్కడ మహాకూటమి నాయకులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నలేదు. చివరి దశలో ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ములాయం, మాయావతి, అఖిలేష్ యాదవ్, తదితర నాయకులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తరవాత పోటీ తీవ్ర స్ధాయిలో ఉంటుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కాశీ విశ్వనాధ్ కారియడ్ ప్రాజెక్టు పేరుతో కాశీ పురాతన సంపద ధ్వంసం చేశారని దానితో స్ధానికులు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని అదేవిధంగా సామాజిక, కులాల, సమీకరణలు కూడా కలిసి వస్తాయని షాలిని యాదవ్ మద్దతుదారులు అశాశిస్తున్నారు. చివరి దశలో జరిగే ఎన్నికలు కాబట్టి చివరి వారంలో నాయకులు పర్యటనలతో నువ్వా? నేనా? అనే రీతిలో హోరాహోరీగా ప్రచారం జరగడం ఖాయమని రాజకీయ పండితులు అంచనా.