రోడ్డు ప్రమాదంలో పంచాయతీ పారిశుధ్య కార్మికరాలు మృతి
రోడ్డు ప్రమాదంలో పంచాయతీ పారిశుధ్య కార్మికురాలు గాలిముట్టి లీలమ్మ (50) మృతి చెందిన సంఘటన శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది
వివరాల్లోకి వెళితే పొదిలి గ్రామ పంచాయతీ నందు పారిశుధ్య కార్మికురాలు గా పనిచేస్తున్న లీలమ్మ పంచాయతీ విధుల్లో వెళ్ళేందుకు బాప్టిస్ట్ పాలెం నుంచి పంచాయతీ కార్యాలయం వద్ద చేసుకొనేందుకు దారిన వెళ్ళే ద్విచక్రవాహనంపై ఎక్కి చాంద్ రెస్టారెంట్ వద్దకు రాగానే ఎదురుగా అతి వేగంగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం ఢీకొనటంతో ద్విచక్ర వాహనం పై నుంచి పడి తీవ్రంగా గాయపడ్డి మరణించినట్లు కుమారుడు గాలిముట్టి నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు యస్ఐ సురేష్ ఒక ప్రకటన లో తెలిపారు