రక్షణశాఖ మద్యం పట్టివేత ఒక్కరి అరెస్టు
భారత రక్షణ శాఖ చెందిన మద్యం పట్టివేసి ఒక్కరిని అరెస్టు చేసిన సంఘటన శుక్రవారం నాడు చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే విశ్వసనీయ సమాచారం మేరకు పొదిలి ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ అధికారులు స్ధానిక గ్రామీణ మండల పరిధిలోని రామాపురం గ్రామంలో నందు ఒక వ్యక్తి నుంచి 20 పుల్ బాటిల్స్ 6 క్వార్టర్ బాటిల్స్ ను స్వాధీనం చేసుకొని అరెస్టు చేసినట్లు యస్ఇబి యస్ఐ రాజేంద్రప్రసాద్ సామాజిక మాధ్యమం ద్వారా పొదిలి టైమ్స్ కు తెలిపారు.
ఈ దాడుల్లో పొదిలి యస్ఇబి స్టేషన్ హెడ్ కానిస్టేబులు కె వెంకట్రావు, కానిస్టేబులు షేక్ బాజీ సయ్యద్, యస్ యన్ గురవయ్య, పి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు