విద్యుత్ ఘాతుకానికి యువకుడు మృతి
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
విద్యుత్ ఘాతుకానికి యువకుడు మృతి చెందిన సంఘటన శనివారం ఉదయం చోటుచేసుకుంది
వివరాల్లోకి వెళితే స్థానిక నగర పంచాయితీ పరిధిలోని పోతవరం గ్రామానికి చెందిన పులుసు వెంకటేశ్వర రెడ్డి డిష్ వైర్ మార్చే క్రమంలో డిష్ వైర్ కు విద్యుత్ సరఫరా కావటంతో విద్యుత్ షాక్ తో తీవ్రంగా గాయపడ్డాడు
గాయపడిన వెంకటేశ్వర రెడ్డి ని స్థానికులు హుటాహుటిన పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి వైద్యసహాయం అందించేందుకు వైద్యలు విశ్వం ప్రయత్నం చేసి విఫలం కావడంతో వైద్యులు మృతి చెందినట్లు దృవీకరించారు.
విషయం తెలుసుకున్న పొదిలి యస్ఐ శ్రీహరి ప్రభుత్వం వైద్యశాలకు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.