పొదిలి పంచాయతీ ప్రత్యేకాధికారిగా రంగనాయకులు బాధ్యతలు స్వీకరణ
పొదిలి గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారిగా ఈఓఆర్డీ రంగనాయకులును నియమిస్తూ మంగళవారంనాడు జిల్లా పంచాయతీరాజ్ అధికారుల ఆదేశాలు జారీచేశారు.
ఇటీవల ప్రత్యేకాధికారిణిగా విధులు నిర్వహిస్తున్న ఎంపీడీఓ రత్నజ్యోతిని ఎన్నికల విధుల నిమిత్తం బదిలీచేసి ఆ స్థానంలో ఈఓఆర్డీ రంగనాయకులును నియమించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈఓఆర్డీ రంగనాయకులు మంగళవారంనాడు బాధ్యతలు స్వీకరించారు.