భర్తపై భార్య దాడి మృతి చెందిన భర్త
భర్తపై భార్య దాడి చేయడంతో భర్త అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన గురువారంనాడు తెల్లవారు జామున సంఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే పొదిలి పట్టణంలోని పడమటిపాలెంలో నివాసం ఉంటున్న మహబుబ్ షకీలా దంపతులకు పిల్లలు లేకపోవడంతో దత్తతకు ఒక కుమారుడిని తీసుకోగా….. అతను చెడు వ్యసనాలకు బానిసై ఉండడంతో ఆస్థిని అతని పేరున రిజిస్టర్ చేసేందుకు మహబూబ్ నిరాకరించడంతో తరుచూ ఘర్షణలు జరుగుతున్నాయని…….
గురువారం తెల్లవారుజామున భర్త మహబూబ్ పై భార్య షకీలా రోకలి దాడి అక్కడికక్కడే మృతి చెందినట్లు సిఐ శ్రీరాం తెలిపారు. జరిగిన సంఘటనపై షకీలాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.