ద్విచక్ర వాహనాలు ఢీ ఇద్దరికి గాయాలు
రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు గాయపడిన సంఘటన సోమవారంనాడు చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే 5వ సచివాలయం పరిధిలో పని చేస్తున్న గ్రామ వాలంటీర్ శివపార్వతి స్థానిక చర్చి సమీపంలోని గృహాలనందు తన విధులు పూర్తి చేసుకుని స్కూటీపై ఇంటికి వెళ్ళే క్రమంలో ఎదురుగా వచ్చిన మరో బైకు ఢీకొనడంతో వాలంటీర్ శివపార్వతి, బైకిస్టు నారాయణ గాయపడగా వారిని స్థానికులు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
విషయం తెలుసుకున్న పొదిలి పంచాయతీ కార్యదర్శి బ్రహ్మ నాయుడు వైద్యశాలకు చేరుకుని వాలంటీర్ ను పరామర్శించారు.