ఎన్ఈఈటీలో జాతీయ స్థాయి ర్యాంకు సాధించిన పొదిలి ఆణిముత్యం

పొదిలి పట్టణానికి చెందిన రావి కిషోర్ జాతీయ స్థాయి ఎన్ఈఈటీలో 11వ ర్యాంకు సాధించడం పట్ల పొదిలి పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
వివరాల్లోకి వెళితే విశ్రాంత జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రావి వెంకటేశ్వర్లు, టీచర్ జయంతిమాల దంపతుల కుమారుడు రావి కిశోర్ హైదరాబాదులోని మమత వైద్యశాల ఎండిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ…… ఇటీవల సెప్టెంబరు 15న నిర్వహించిన ఎన్ఈఈటీ పరీక్షలలో గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగంలో పరీక్షవ్రాయగా తుది ఫలితాలలో జాతీయస్థాయిలో 11వ ర్యాంకు సాధించడం పట్ల…….

తమ కుమారుడు జాతీయ స్థాయిలో ర్యాంకు సాధించడం పట్ల డాక్టర్ కిషోర్ తల్లిదండ్రులు, ఆనందంలో మునిగిపోగా….. కుటుంబ సభ్యులు, పట్టణ వాసులు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.