దేశవ్యాప్త బ్యాంకు సమ్మెలో పాల్గొన్న పొదిలి బ్యాంకు ఉద్యోగులు
కేంద్ర ప్రభుత్వం బ్యాంకులను ప్రైవేటీకరణ చెయ్యాలనే ఆలోచన వెంటనే విరమించుకోవాలని కోరుతూ దేశవ్యాప్తంగా గురువారం, శుక్రవారం రెండు రోజుల పాటు సమ్మె చెయ్యాలని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ పిలుపు మేరకు స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పొదిలి బ్రాంచ్ నందు విధులను విధులు బహిష్కరించి సమ్మెకు దిగారు.
యస్బీఐ బ్యాంకు వద్ద నుంచి ఎంపిడిఓ కార్యాలయంలో వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బ్యాంకు ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు నారాయణ రెడ్డి, బాబు, శివరాం, కే బాలకోటయ్య, సుబ్బా రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బ్యాంకు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.