ప్రేక్షకుల జేబులకు చిల్లు పెడుతున్న థియేటర్ల యాజమాన్యాలు
వివరాల్లోకి వెళితే పట్టణంలోని సినిమా థియేటర్ల యాజమాన్యాలు తమ ఇష్టానుసారంగా రేట్లను పెంచేసి ప్రేక్షకుల జేబులు చిల్లు పెడుతున్నారు….. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛ్ భారత్ నినాదాలను విస్మరించి….
థియేటర్లలో కనీస సౌకర్యాలు చేపట్టకుండా గ్రామీణ ప్రాంతాలలో 30రూపాయలలోపు ఉన్న టిక్కెట్టును 150నుండి 200రూపాయల వరకు అమ్ముతున్నారని ప్రేక్షకులు పలుమార్లు మొత్తుకున్నా…. ఆ సమయంలో వచ్చి నామమాత్రంగా తనిఖీ చేసి ప్రేక్షకుల జేబులకు చిల్లులు పెడుతున్నా కనీసం థియేటర్ల యాజమాన్యాలకు నోటీసులు కూడా జారీ చేయకుండా ప్రేక్షకపాత్ర వహిస్తున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం పలు విమర్శలకు తావిస్తోంది.
అదే విధంగా థియేటర్లలో మూత్రశాలలు సైతం అత్యంత దుద్గంధం వేదజల్లడం….. క్యాంటీన్ లలో సైతం మనం ఏమి ఆహారం తీసుకుంటున్నాం అనే విషయం (ఎఫ్ సి ఐ) లేబుల్ లేకుండా నాసిరకంగా తయారు చేసిన వాటిని అమ్ముతూ….. టిక్కెట్టును అధిక ధరకు అమ్మడమే కాకుండా పార్కింగ్ రుసుము సైతం వసూలు చేసున్నా కూడా అధికారులు స్పందించకపోవడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.