రోడ్డు మీద అనవసరంగా తిరిగితే ఇంకా కేసు నమోదే : సిఐ సుధాకర్ హెచ్చరిక
రోడ్డు మీద అనవసరంగా తిరిగితే ఇంకా కేసు నమోదు చేస్తామని పొదిలి సిఐ సుధాకర్ రావు హెచ్చరించారు.
వివరాల్లోకి వెళితే మంగళవారం నాడు పొదిలి పట్టణంలో కర్ఫ్యూ సమయంలో అనవసరంగా రోడ్డు మీద వచ్చిన వాహనాలను స్టేషన్ లోకి తరలించి అనంతరం వారికి సిఐ సుధాకర్ కౌన్సిలింగ్ ఇచ్చారు.
ఈ కౌన్సిలింగ్ లో పొదిలి యస్ఐ సురేష్ తదితరులు పాల్గొన్నారు