ప్రజా సమస్యలు పరిష్కారం కోసం పలు తీర్మానాలు చేసిన వినియోగదారుల రక్షణ సమితి
ప్రజా సమస్యల పరిష్కారానికై వినియోగదారుల రక్షణ సమితి పలు దేవాలయాలలో తీర్మానాలు చేసింది.
వివరాల్లోకి వెళితే సోమవారం నాడు స్థానిక విశ్వనాథపురం లోని సంస్థ కార్యాలయంలో సంస్థ అధ్యక్షుడు ధర్నాసి రామారావు గారి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం లోపెరిగిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ వంట నూనె మరియు నిత్యావసర వస్తువుల ధరలు వెంటనే తగ్గించాలని విశాఖ ఉక్కు కర్మాగారం అమ్మడం ఆపివేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆమోదించడమైనది.
బ్యాంకుల వారు వినియోగదారుల డబ్బు స్వీకరించుటకు ఎప్పుడూ కూడా సర్వర్ పనిచేయుట లేదని, ప్రింటర్ పనిచేయుట లేదని అనలేదు, కాని పాస్ బుక్ ప్రింట్ చేయమన్నపుడు ప్రింటర్ పనిచేయుట లేదని తరచూ బ్యాంకుల సిబ్బంది ఇబ్బంది పెడుతున్నారని తగిన చర్యలు తీసుకోవాలని మరియు గంటల తరబడి లైన్ లో నిలబడి కౌంటర్ వద్దకు చేరగా తదుపరి పని వేరొక కౌంటర్ లో మరలా లైనులో నిలబడవలసిన పరిస్థితి ఉన్నందున వినియోగదారులు దినసరి పనులు ఆదాయం నష్టపోతున్నామని వాపోయారు. మురుగు కాల్వలు అధ్వాన్నంగా ఉన్నా సరిగా శుభ్రం చేయుట లేదని కొన్ని చోట్ల వారమునకు ఒకసారి వచ్చినా పూర్తిగా శుభ్రం చేయుట లేదని విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్ళాలని, ట్రాపిక్ సమస్య విపరీతంగా పెరిగిపోయి రోడ్డు దాటుటకు భయపడాల్సి వస్తుందని డివైడర్ల అవసరం ఉందని ఏకగ్రీవంగా తీర్మానించి ఆమోదించి నందున కార్యదర్శి జి బి షా సంబంధించిన ఉన్నతాధికారుల దృష్టికి తీసికొని వెళ్ళుటకు చర్యలు చేపట్టారు.
ఈ కార్యక్రమంలో వెలుగొండయ్య, జహంగీర్ బాషా ఈసీ డి సుజాత, అపర్ణ, హాఫిషా, లోక్అదాలత్ సభ్యులు భూమారాంబబు, పిర్ఓ సుబ్బారావు , షేక్ రహిమాన్ , హుస్సేన్ పాఛ్ఛా, పి. నాగేశ్వరరావు, ఎం, పుల్లయ్య, కెఎస్ చౌదరి, అబ్దుల్ కలాం, చెంచుసుబ్బారావు, బి నాగరాజు, డేవిడ్ సన్, జిలాని, నిషాద్, బాషామోహిద్దిన్, కన్నబాబు, స్ఆర్ పాచ్ఛా, మనోరంజన్ తదితరులు పాల్గొన్నారు.