ప్రశాంతంగా ముగిసిన సిటిబిసి ఎన్నికలు… కొలువుతీరిన నూతన పాలకవర్గం
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
సెంటినరి తెలుగు బాప్టిస్ట్ చర్చ్ పాలకవర్గం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.
వివరాల్లోకి వెళితే శనివారం నాడు స్థానిక తెలుగు బాప్టిస్ట్ చర్చ్ నందు నూతన పాలకవర్గం కు సంబంధించి జరిగిన ఎన్నికల్లో మొత్తం 321 ఓట్లు గాను 280 ఓట్లు పోలింగ్ జరిగింది
అనంతరం ఓట్లు లెక్కింపులో అధ్యక్ష పదవికి బరిలో ఉన్న గంగవరపు వసంత కుమార్ గుడూరి వినోద్ కుమార్ ల్లో వంసత కుమార్ విజయం సాధించాగా కార్యదర్శి పదవికి బరిలో ఉన్న పులుకురి రవీంద్ర బాబు, వెల్పుల ప్రభుదాస్, ముక్కర సాల్మన్ మనోరంజన్ ల్లో పులుకురి రవీంద్ర బాబు గెలుపొందగా కోశాధికారి పదవికి బరిలో ఉన్న గుంటగాని శ్యాం కిరణ్, మంగళ నవీన్ మార్క కళ్యాణ్ కుమార్ ల్లో గుంటగాని శ్యాం కిరణ్ గెలుపొందారు.
అనంతరం ఎన్నికల అధికారులు విజేతలు చేత ప్రమాణం స్వీకారం చేయించారు.
ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పొదిలి యస్ఐ శ్రీహరి ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు
ఈ ఎన్నికల ప్రక్రియలో సంఘ కాపరి తేళ్ళ జాన్ విక్టర్, సహాయ సంఘ కాపరి గొంగటి సురేష్ కుమార్, వై సుధాకరసూరి, సుధాకర్, ఎం కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రశాంతంగా ముగిశాయి