పొదిలి నగర పంచాయితీకి మోగనున్న ఎన్నికల నగారా

వార్డుల ఏర్పాటు, ఓటరు లీస్టు తయారు చెయ్యాలని ఆదేశాలు

పదిరోజుల్లో కొలిక్కి వచ్చే అవకాశం

నెలాఖరులోగా నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం

పొదిలి నగర పంచాయితీ ఎన్నికలా నగారా మోగనున్నదా ప్రస్తుత వాతావరణం చూస్తుంటే నెలాఖరులోగా నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం కనబడుతుంది.

అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం పొదిలి నగర పంచాయితీ కార్యాలయంకు రాష్ట్ర మున్సిపల్ శాఖ అధికారులు నుంచి వచ్చిన సమాచారం మేరకు యుద్ధప్రాతిపదికన వార్డుల ఏర్పాటు ఓటరు లీస్టు తయారు చెయ్యాలని ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది.

సంబంధించిన వార్డుల ఏర్పాటు ఓటరు లీస్టు తయారు ప్రక్రియను పూర్తి చేసి మున్సిపల్ శాఖ అధికారులు పంపేందుకు నగర పంచాయితీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.

అన్ని సజావుగా సాగితే పొదిలి నగర పంచాయితీకి నెలాఖరులోగా నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది