చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి
భారత పౌరులందరూ చట్టాలపై అవగాహనా కలిగి ఉండాలని జూనియర్ సివిల్ కోర్టు జడ్జి మరియు మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎస్ సి రాఘవేంద్ర అన్నారు.
స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో జడ్జి మాట్లాడుతూ ముద్దాయిలకు కూడా చట్టం రక్షణ కల్పిస్తుందని, ప్రమిసరి నోట్లు మరియు చెక్కులు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని….. భూముల క్రయ విక్రయాలలో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో పొదిలి బార్ అసోసియేషన్ న్యాయవాదులు షేక్ షబ్బీర్, ఎస్ ఎం బాషా, యం వి రమణ కిషోర్, జి శ్రీనివాసులు, గాదె సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.