ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని కోరిన జూనియర్ సివిల్ జడ్జి భార్గవి

పొదిలి మున్సిపల్ కార్యాలయంలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ జూనియర్ సివిల్ జడ్జి హాజరై ప్రసంగించారు ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని చట్టాల గురించి అవగాహన కల్పించారు.

మున్సిపల్ కమిషనర్ భవాని ప్రసాద్ మాట్లాడుతూ చట్టం దృష్టిలో అందరూ సమానమేనని, ఏ చట్టం చేసిన రాజ్యాంగానికి లోబడి చేస్తుందని రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. పారా లీగల్ వాలంటీర్ లక్ష్మి మాట్లాడుతూ అందరికీ చెరువలో న్యాయం సత్వర న్యాయం అందించడం ముఖ్య ఉద్దేశం గా పారా లీగల్ వాలంటీర్లు పని చేయడం జరుగుతుందని మారుమూల ప్రాంతాలలో ఎటువంటి సమస్య ఉన్నా అర్జీ రూపంలో సమస్యను మండల న్యాయ సేవాధికార సంస్థ కు పంపడం ద్వారా సత్వర న్యాయం పొందవచ్చు అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతీ రావు,కోర్టు సిబ్బంది సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు