పొదిలికొండ లక్ష్మీనరసింహస్వామి భూమి సర్వే…

పొదిలి గ్రామ సర్వే నెంబర్ 831/1లో పొదిలి కొండ లక్ష్మీ నరసింహ స్వామి వారి పేరు మీద 7.41 ఎకరాల భూమి కలదు
గత నెలలో భూమి కౌలు వేలం సందర్భంగా అధికారులు అక్రమణ గురైందని ఆరోపణలు ఉన్నాయి సర్వే పూర్తి చేసిన తర్వాత కౌలు వేలం నిర్వహించాలని నిర్ణయించినట్టు ప్రకటించి అనంతరం మంగళవారం నాడు సర్వే నిర్వహించాగా సుమారు 70 సెంట్లు పైగా రోడ్డు నిర్మాణం 30 సెంట్లుల్లో నిర్మాణాలు ఉన్నట్లు సర్వే లో బయట పడింది.

తక్షణమే దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు భూమి చూట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి భూముల ఆక్రమణకు గురికాకుండా కాపాడే విధంగా చర్యలు తీసుకొని కోట్లాది రూపాయల విలువైన పొదిలి కొండ లక్ష్మీ నరసింహ స్వామి వారి భూములను కాపాడాలని భక్తులు కోరుతున్నారు.

ఈ సర్వే కార్యక్రమంలో పొదిలికొండ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి యన్ వి రవికుమార్ , సర్వేయర్ బ్రహ్మం, విఆర్ఓ అనిల్ , దేవస్థానం సీనియర్ అసిస్టెంట్ కాటూరి ప్రసాద్, దేవస్థానం పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు