నాలుగో విడతలో పొదిలి, కొనకనమిట్ల, మర్రిపూడి పంచాయతీ ఎన్నికలు

పొదిలి, కొనకనమిట్ల, మర్రిపూడి మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నాలుగో విడత నిర్వహిస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

పొదిలి, కొనకనమిట్ల, మర్రిపూడి మండలాల్లోని గ్రామ పంచాయతీలకు ఫిబ్రవరి 6వతేది నోటిఫికేషన్ విడుదల చేస్తుంది….. ఫ్రిబ్రవరి 6వ తేదీ నుంచి 8వతేదీ వరకు నామినేషన్లను స్వీకరణ 9వతేదీ నామినేషన్లు పరిశీలన 10వతేదీ తిరస్కరించిన నామినేషన్లపై అప్పిల్ చేసుకునేందుకు రెవెన్యూ డివిజనల్ అధికారికి అవకాశం…….

11వతేదీ అభ్యర్థుల తుది జాబితా ఖరారు…….. 12వతేదీ నామినేషన్లు ఉపసంహరణకు మధ్యాహ్నం 3గంటల వరకు గడువు 3గంటల తరువాత తుది జాబితా ఖరారు చేసి గుర్తులు కేటాయింపు……. 15వతేదీ సాయంత్రం 5గంటల ప్రచారానికి తెర…… 17వతేదీ ఉదయం 6:30గంటల నుండి మధ్యాహ్నం 3:30గంటల వరకు…… పోలింగ్ తదుపరి లెక్కింపు ప్రారంభం
అనంతరం ఉప సర్పంచ్ ఎన్నిక జరుగుతున్నట్లు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.