పొదిలిలో ఏసీబీ తనిఖీలు
పొదిలి : పంచాయతీరాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పగడాల రవిప్రకాష్ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగిఉన్నారనే సమాచారంతో జిల్లా వ్యాప్తంగా ఏసీబీ దాడులు నిర్వహించింది. వివరాల్లోకి వెళితే కనిగిరి పంచాయతీరాజ్ డిఈ గా పనిచేస్తున్న పగడాల రవిప్రకాష్ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే సమాచారంతో రవిప్రకాష్ కార్యాలయం మరియు నివాసంలో సోదాలు నిర్వహించారు.
ఈ సోదాలలో భాగంగా రవిప్రకాష్ బంధువులు సన్నిహితుల నివాసాలలో కూడా దాడులు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు చిన్నబస్టాండులోని స్థానిక శివాలయం వెనుక వీధిలో నివసించే రవిప్రకాష్ వియ్యంకురాలైన పెద్దిశెట్టి విజయమ్మ నివాసంలో కూడా సోదాలు నిర్వహించిన అనంతరం నెల్లూరు ఏసీబీ సిఐ శ్రీహరి రావు మాట్లాడుతూ జిల్లాలోని పలుచోట్ల సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.